ములాయం ఇంట్లో రోజుకో కొత్త డ్రామా | Samajwadi Party's family drama is of no interest in UP: BSP | Sakshi
Sakshi News home page

ములాయం ఇంట్లో రోజుకో కొత్త డ్రామా

Oct 22 2016 3:41 PM | Updated on Jul 30 2018 8:10 PM

ములాయం ఇంట్లో రోజుకో కొత్త డ్రామా - Sakshi

ములాయం ఇంట్లో రోజుకో కొత్త డ్రామా

ములాయం సింగ్ యాదవ్ కుటుంబం డ్రామా నడుపుతోందని బీఎస్పీ విమర్శించింది.

లక్నో: అధికార సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఆ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబం డ్రామా నడుపుతోందని బీఎస్పీ విమర్శించింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ములాయం కొన్ని రోజులుగా కుటుంబ డ్రామా సృష్టిస్తున్నారని, రోజుకో కొత్త డ్రామా తెరపైకి తెస్తున్నారని బీఎస్పీ నేత సుధీంద్ర భడోరియా ఆరోపించారు.

సమాజ్ వాదీ పార్టీ ప్రజల దృష్టిలో పలచన అవుతోందని, ఆ పార్టీ వ్యవహారం గురించి ప్రజలు కూడా పట్టించుకోవడం లేదని సుధీంద్ర అన్నారు. బాబాయ్, యూపీ పార్టీ చీఫ్ శివపాల్ యాదవ్ నిర్వహించిన భేటీకి అఖిలేష్ డుమ్మా కొట్టారు. అంతేగాక, అఖిలేష్ కొత్త పార్టీ పెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. శివపాల్కు, అఖిలేష్కు విబేధాలున్నట్టు కథనాలు వస్తున్న ఈ నేపథ్యంలో బీఎస్పీ నేత సుధీంద్ర స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement