
సల్మాన్ ఖాన్ కేసు 22కు వాయిదా
సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసు విచారణ జనవరి 22కు వాయిదా పడింది.
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసు విచారణ జనవరి 22కు వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన విచారణకు సల్మాన్ ఖాన్ హాజరు కాలేదు. ఆయన తరపు న్యాయవాది శ్రీకాంత్ శివాదె కూడా కోర్టుకు రాలేదు. అనారోగ్యం కారణంగా శ్రీకాంత్ రాలేకపోయారని డిపెన్స్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.కేసు విచారణ వాయిదా వేయాలని కోరారు.
మరోవైపు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి తనకు పోలీసు రక్షణ కల్పించాలని కోర్టుకు మౌఖికంగా విజ్ఞప్తి చేశాడు. లిఖితపూర్వకంగా కోరితే అతడి విజ్ఞప్తిని పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు.