ఐపీఎల్‌ అవ్వగానే పెళ్లి చేసుకుంటామోచ్‌! | Sagarika reveals wedding plans with Zaheer Khan | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ అవ్వగానే పెళ్లి చేసుకుంటామోచ్‌!

Apr 25 2017 6:09 PM | Updated on Sep 5 2017 9:40 AM

ఐపీఎల్‌ అవ్వగానే పెళ్లి చేసుకుంటామోచ్‌!

ఐపీఎల్‌ అవ్వగానే పెళ్లి చేసుకుంటామోచ్‌!

ఐపీఎల్‌ అవ్వగానే పెళ్లి పీఠలు ఎక్కుతారట..

గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న సాగరికా ఘట్గే, జహీర్‌ ఖాన్‌ ఎట్టకేలకు  ఒక్కటవుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ప్రేమపక్షులుగా విహరిస్తూ.. బయటకు ఏమీ చెప్పకుండా గడిపిన ఈ జంట ఇటీవలే తాము నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించి విస్మయంలో ముంచెత్తారు. తాము నిశ్చితార్థం చేసుకున్నట్టు టీమిండియా మాజీ క్రికెటర్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సారథి జహీర్‌ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జహీర్‌ పెళ్లాడబోతున్న బాలీవుడ్‌ భామ సాగరికా ఘట్గే తాజాగా నోరు విప్పింది. మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ పలు విషయాలు వెల్లడించింది.

‘మా నిశ్చితార్థం కోసం జాక్‌ (ప్రేమగా జహీర్‌ను ఇలా పిలుస్తుంది) చాలా రోజులుగా రహస్యంగా ప్లాన్‌ చేశాడు. నిజంగా నాకు విషయం తెలియనే తెలియదు. ఒక అద్భుతమైన రింగ్‌ను నాకోసం తెచ్చి ఇచ్చాడు. ఆ సందర్భాన్ని నేను మాటల్లో వర్ణించలేను. మా మధ్య ఓ ప్రత్యేక అనుభూతిగా అది నిలిచిపోతుంది’ అని సాగరిక తెలిపింది. మరీ పెళ్లెప్పుడు చేసుకుంటున్నారంటే.. ఐపీఎల్‌ అవ్వగానే పెళ్లి పీఠలు ఎక్కుతామని చెప్పింది. ‘ఐపీఎల్‌ ముగియగానే మేం పెళ్లి గురించి చర్చించుకుంటాం. ఇప్పుడు ఐపీఎల్‌ కోసం జాక్‌ బాగా ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది. ఇది అయిపోగానే... మేం పెళ్లి తేదీలు, వేడుకల గురించి ప్లాన్‌ చేసుకుంటాం’ అని ఆమె వివరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement