భూ సేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆర్డినెన్స్ అమానుషమైందని, రైతుల జీవితాల్ని, వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తుందని వామపక్ష రైతు సంఘాలు విమర్శించాయి.
న్యూఢిల్లీ: భూ సేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆర్డినెన్స్ అమానుషమైందని, రైతుల జీవితాల్ని, వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తుందని వామపక్ష రైతు సంఘాలు విమర్శించాయి. తాజా ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతామని సీపీఐ, సీపీఎంలకు చెందిన రైతు సంఘాలైన అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) (రెండు పార్టీల సంఘాలకూ ఒకే పేరు) నేతలు హన్నామ్ మొల్లా, అతుల్ కుమార్ తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
కాగా, ఆర్‌ఎస్‌ఎస్ ఆర్థిక విభాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్‌జేఎం) కేంద్ర తాజా ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా గళమెత్తింది. దీన్ని అమలు చేసేముందు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. ప్రధానంగా యూపీఏ ప్రభుత్వం భూసేకరణచట్టంలో పొందుపరిచిన ఆహారభద్రతా ప్రమాణాలు, సామాజిక ప్రభా వ అంచనాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎస్‌జేఎం వ్యతిరేకించింది.