జియో ఎఫెక్ట్ : ఇండస్ట్రీ రెవెన్యూలు ఢమాల్

జియో ఎఫెక్ట్ : ఇండస్ట్రీ రెవెన్యూలు ఢమాల్ - Sakshi

న్యూఢిల్లీ : ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ అంటూ  ఉచిత ఆఫర్లు గుప్పిస్తున్న రిలయన్స్ జియో వల్ల టెలికాం ఇండస్ట్రీకి రెవెన్యూలు గండికొడుతున్నాయట. దేశీయ టెలికాం ఇండస్ట్రీ తన రెవెన్యూలో ఐదోవంతును కోల్పోతుందని, దానికి గల కారణం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అందించే ఉచిత సర్వీసులేనని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. 2017-18 ఆర్థికసంవత్సరానికి సంబంధించిన అవుట్‍ లుక్ ను సమీక్షించిన  ఈ సంస్థ, టెలికాం సెక్టార్‍ అవుట్‍ లుక్ స్టేబుల్ నుంచి నెగిటివ్‍లోకి(స్థిరం నుంచి ప్రతికూలం) వచ్చినట్టు చెప్పింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఈ రిపోర్టును గురువారం విడుదల చేసింది.  ఇటీవల ఇండస్ట్రీ దిగ్గజాలు విడుదల చేసిన ఫలితాల్లోనూ అవి భారీగా కుప్పకూలాయి.

 

ప్రస్తుతం మార్కెట్లో టెల్కోల మార్కెట్ షేరు పడిపోతుండగా.. రిలయన్స్ జియో సబ్ స్క్రైబర్ బేస్ చాలా త్వరగా పైకి ఎగుస్తున్నట్టు రిపోర్టు పేర్కొంది. 2017 జనవరిలో 72 మిలియన్ సబ్ స్క్రైబర్లుంటే, 2017 మార్చికి 100 మిలియన్లను క్రాస్ చేసినట్టు రిపోర్టు తెలిపింది.  ధర విషయంలోనూ, అనుభూతి పరంగా మార్కెట్ షేరును  ఆకట్టుకోవడంలో జియోకి సామర్థ్యమున్నట్టు పేర్కొంది.  కస్టమర్ బేస్ ను నిలబెట్టుకోవడం ప్రస్తుతం టెల్కోల ముందున్న సవాళ్లని, వారి సామర్థ్యం, స్పీడ్, వర్చ్యువల్ నెట్ వర్క్ ప్లాట్ ఫామ్స్ తో కస్టమర్లను కాపాడుకుంటూ ఉండాలని సూచించింది. ఐడియా, వొడాఫోన్ల విలీనంతో టెలికాం ఇండస్ట్రీలో స్పెక్ట్రమ్, ఇన్ఫ్రాక్ట్ర్చర్ల వృథా ఖర్చులు తగ్గుతాయని రిపోర్టు పేర్కొంది. 

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top