అవినీతిని నిరూపిస్తే జీవితాంతం జైల్లో ఉంటా | Ready to serve life term if ill-gotten money is proved, says a Raja | Sakshi
Sakshi News home page

అవినీతిని నిరూపిస్తే జీవితాంతం జైల్లో ఉంటా

May 4 2014 10:45 PM | Updated on Sep 15 2018 3:51 PM

అవినీతిని నిరూపిస్తే జీవితాంతం జైల్లో ఉంటా - Sakshi

అవినీతిని నిరూపిస్తే జీవితాంతం జైల్లో ఉంటా

విదేశాల్లో తాను రూ. 3000 కోట్ల అవినీతి సొమ్మును దాచినట్లు నిరూపిస్తే జీవితాంతం జైల్లో ఉండేందుకు సిద్ధమని 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ టెలికం మంత్రి ఎ. రాజా పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: విదేశాల్లో తాను రూ. 3000 కోట్ల అవినీతి సొమ్మును దాచినట్లు నిరూపిస్తే జీవితాంతం జైల్లో ఉండేందుకు సిద్ధమని 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ టెలికం మంత్రి ఎ. రాజా పేర్కొన్నారు. తాను అవినీతి సొమ్మును కూడబెట్టినట్లు సీబీఐ వర్గాలను ఉటంకిస్తూ 2011లో ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించిందని...అదే రోజు తాను ఆ అంశాన్ని ఓ జడ్జి దష్టికి తీసుకెళ్లానన్నారు. తన పేరిట ఒక రూపాయి లేక ఒక డాలర్ ఉన్నట్లు సీబీఐ, ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌లు నిరూపిస్తే కేసును సవాల్ చేయకుండా జీవితాంతం జైల్లో ఉంటానని జడ్జికి చెప్పినట్లు ఓ వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజా చెప్పుకొచ్చారు.

 

ఈ కేసులో రాజాను 2011 ఫిబ్రవరి 2న సీబీఐ అరెస్టు చేసింది. బెయిల్‌పై విడుదలైన ఆయన ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులోని నీలగిరి స్థానం నుంచి పోటీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement