వార్తల్లో నిలిచేందుకే మోదీ ప్రస్తావన: వెంకయ్య | Rahul Gandhi using PM Modi's name to remain in news: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

వార్తల్లో నిలిచేందుకే మోదీ ప్రస్తావన: వెంకయ్య

Sep 21 2015 2:26 AM | Updated on Mar 18 2019 9:02 PM

వార్తల్లో నిలిచేందుకే మోదీ ప్రస్తావన: వెంకయ్య - Sakshi

వార్తల్లో నిలిచేందుకే మోదీ ప్రస్తావన: వెంకయ్య

ఎప్పుడూ వార్తల్లో నిలిచేందుకే ప్రధాని మోదీ పేరును రాహుల్ ప్రస్తావిస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

బెంగళూరు/సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడూ వార్తల్లో నిలిచేందుకే ప్రధాని మోదీ పేరును రాహుల్ ప్రస్తావిస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. రాహుల్ మానసిక పరిపక్వత లేకుండా, చిన్నపిల్లాడిగా వ్యవహరిస్తున్నారని బెంగళూరులో అన్నారు. రాహుల్ తాత జవహర్‌లాల్ నెహ్రూ, తండ్రి రాజీవ్  గాంధీలు సైతం సూటు బూటు వేషధారణలోనే పాలించారనే విషయం గుర్తులేదా? అని ఆయన ప్రశ్నించారు. కాగా, యూపీఏ ప్రభుత్వ  పదేళ్ల పరిపాలనలో ‘టేక్ ఇన్ ఇండియా’ జరిగిందని బీజేపీ విమర్శించింది.

2జీ స్పెక్ట్రం, బొగ్గు గనుల కుంభకోణం, కామన్‌వెల్త్ క్రీడల్లో (టేక్) తీసుకోకుండా నిర్ణయాలేవీ జరగలేదని బీజేపీ అధికార ప్రతినిధి, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు సంధించారు. కాంగ్రెస్ కిసాన్ సమ్మాన్ ర్యాలీలో సోనియా, రాహుల్ చేసిన విమర్శలపై  ఢిల్లీలో ఆయన స్పందించారు.

రైతులను ఎప్పుడూ పేదరికంలోనే ఉంచాలని కాంగ్రెస్ చూసిందన్నారు. సోనియా అల్లుడు వాద్రా భూ అభివృద్ధి పేరిట రైతులు భూములు లాక్కున్నప్పడు వారికి రైతుల ఆత్మగౌరవం గుర్తుకురాలేదా? అని ఆయన ప్రశ్నించారు. తమ హయాంలో నిజాయితీగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement