యూపీలో 325.. గుజరాత్‌లో 150 | Pumped-up BJP may go for early polls in Gujarat | Sakshi
Sakshi News home page

యూపీలో 325.. గుజరాత్‌లో 150

Mar 21 2017 8:21 AM | Updated on Sep 5 2017 6:42 AM

యూపీలో 325.. గుజరాత్‌లో 150

యూపీలో 325.. గుజరాత్‌లో 150

ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చన్న ఊహాగానాలకు ఊతమిస్తూ గుజరాత్‌లోని పలు నగరాల్లో వెలసిన పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి.

అహ్మదాబాద్‌: ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చన్న ఊహాగానాలకు ఊతమిస్తూ గుజరాత్‌లోని పలు నగరాల్లో వెలసిన పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి. పోస్టర్లలోని ‘యూపీలో 325, గుజరాత్‌లో 150’ నినాదం హాట్‌ టాపిక్‌గా మారింది. యూపీ ఎన్నికల్లో బీజేపీ 325 స్థానాలు దక్కించుకుని భారీ విజయం సాధించిందని, గుజరాత్‌లో 150 స్థానాలు సాధించడమే లక్ష్యంగా పేర్కొంటూ ఈ పోస్టర్లు వెలిశాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోల్ని కూడా ముద్రించారు.

నిజానికి ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిఉండగా.. యూపీ గెలుపు ఊపులో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. దీనిపై గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ మాట్లాడుతూ.. దేశమంతా మోదీ గాలి వీస్తోందని, ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనని, 150 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement