ప్రొ.కోదండరామ్తో టీటీడీపీ అధ్యక్షుడు భేటీ | prof. kodandaram meeting with l ramana | Sakshi
Sakshi News home page

ప్రొ.కోదండరామ్తో టీటీడీపీ అధ్యక్షుడు భేటీ

Oct 13 2015 10:26 AM | Updated on Sep 3 2017 10:54 AM

ప్రొ.కోదండరామ్తో టీటీడీపీ అధ్యక్షుడు భేటీ

ప్రొ.కోదండరామ్తో టీటీడీపీ అధ్యక్షుడు భేటీ

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ .రమణ మంగళవారం ఉదయం ప్రొ. కోదండరామ్ నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై... తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఎల్ రమణ.. ప్రొ.కోదండరామ్ ని కోరినట్లు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహారిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేయాలంటూ ఇటీవల అసెంబ్లీలో డిమాండ్ చేసిన ప్రతిపక్షా పార్టీల సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం విదితమే.

అలాగే ఒకే దఫా రుణమాఫీ చేయాలంటూ తెలంగాణ బంద్కు ప్రతిపక్షాలు పిలుపు నిచ్చాయి.  అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడిపింది. దీంతో బంద్ అంతాగా విజయం సాధించలేకపోయింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొ.కోదండరామ్ మద్దతు తీసుకుని... టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టీటీడీపీ భావిస్తుంది. ఆ క్రమంలో ప్రొ. కోదండరామ్ను మద్దతు కోరేందుకు ఎల్ రమణ భేటీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement