బాలానగర్‌లో ప్రైవేట్ బస్సు దగ్ధం | Private bus burning in balanagar | Sakshi
Sakshi News home page

బాలానగర్‌లో ప్రైవేట్ బస్సు దగ్ధం

Jan 1 2016 3:36 AM | Updated on Sep 29 2018 5:26 PM

బాలానగర్‌లో ప్రైవేట్ బస్సు దగ్ధం - Sakshi

బాలానగర్‌లో ప్రైవేట్ బస్సు దగ్ధం

ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గురువారం రాత్రి హైదరాబాద్ బాలానగర్‌లో దగ్ధమైంది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో సుచిత్ర నుంచి బెంగళూరుకు బయలుదేరింది.

హైదరాబాద్: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గురువారం రాత్రి హైదరాబాద్ బాలానగర్‌లో దగ్ధమైంది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో సుచిత్ర నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఇది బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా వద్దకు చేరుకున్న సమయంలో ఏసీ ప్లోనర్ జామ్ అయింది. ఫలితంగా స్వల్పంగా మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ విజయ్‌కుమార్ అప్రమత్తమయ్యారు. వెంటనే  బస్సును రోడ్డు పక్కకు తీసి ఆపేశారు. ప్రయాణికుల్ని కిందకు దింపేసిన కొద్దిసేపటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు మొత్తం కాలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో గంట పాటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement