రాష్ట్రపతి మెడల్ కోసం వెళుతుంటే దొంగతనం | Principal on her way to receive President's medal robbed in train | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి మెడల్ కోసం వెళుతుంటే దొంగతనం

Sep 3 2015 2:19 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీకి బయలు దేరిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్ రైళ్లో దొంగతనానికి గురైంది.

న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీకి బయలు దేరిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్... రైల్లో చోరీ బారిన పడ్డారు. గ్వాలియర్ నగరానికి చెందిన సురేఖా సక్సేనా.. ఓ కేంద్రీయ విద్యాలయంలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ఆమె రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు ఎంపిక కావడంతో ఆ అవార్డు తీసుకునేందుకు తన సోదరుడు సురేందర్ సక్సేనాతో కలసి సమతా ఎక్స్ ప్రెస్ ఏసీ టూ టైర్ రైలులో బయలుదేరారు.

రైలు మధుర స్టేషన్లో ఆగగానే చాయ్ అంటూ వచ్చిన ఓ వ్యక్తి వారికి చాయ్ పోసినట్లుగా పోసి సడెన్గా ఓ స్ప్రే బాటిల్ తీసి వారిపై ప్రయోగించారు. వారు అతడిని అడ్డుకునే ప్రయత్నంలో పడ్డారు. ఈలోపే అతడు పారిపోయాడు. అనంతరం చూసుకున్న వారికి ఆమె పర్సు, సోదరుడి గోల్డ్ వాచ్ పోయినట్లు తెలిసి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement