ఆ నటితో డేటింగ్‌ చేస్తున్న ప్రిన్స్‌! | prince dating actress Meghan Markle | Sakshi
Sakshi News home page

ఆ నటితో డేటింగ్‌ చేస్తున్న ప్రిన్స్‌!

Oct 31 2016 4:07 PM | Updated on Sep 4 2017 6:48 PM

ఆ నటితో డేటింగ్‌ చేస్తున్న ప్రిన్స్‌!

ఆ నటితో డేటింగ్‌ చేస్తున్న ప్రిన్స్‌!

బ్రిటన్‌ యువరాజు హ్యారీ ప్రేమలో మునిగితేలుతున్నాడు.

లండన్‌: బ్రిటన్‌ యువరాజు హ్యారీ ప్రేమలో మునిగితేలుతున్నాడు. తన కన్నా మూడేళ్లు పెద్దదైన అమెరికన్‌ టీవీ నటి మేఘన్‌ మార్కెల్‌తో ఆయన డేటింగ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.  ‘సూట్స్‌’ టీవీ డ్రామాతో పాపులర్‌ అయిన మేఘన్‌తో సానిహిత్యంతో పెరిగాక ప్రిన్స్‌ హ్యారీ చాలా ఆనందంగా ఉంటున్నాడని ఆయన సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ’ద సన్‌డే ఎక్స్‌ప్రెస్‌’ పత్రిక తెలిపింది. 35 ఏళ్ల మేఘన్‌ అందం చూసి హ్యారీ ఫిదా అయ్యాడని, అయితే, వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను నెమ్మదిగా ముందుకుతీసుకెళుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి.

’కొన్నివారాలుగా వారు సన్నిహితంగా ఉంటున్నారు. ఒకరినొకరు చూడటాన్ని ఇష్టపడుతున్నారు. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది’ అని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, ’తమ మధ్య కొనసాగుతున్న బంధాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టాలని హ్యారీ ప్రయత్నిస్తున్నాడు. తమ రొమాన్స్‌ గురించి బయటకు తెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో హ్యారీకి తెలుసు. అయితే, ఈ విషయాన్ని దాచిపెట్టడం కూడా కష్టమని ఆయన భావిస్తున్నారు’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ’సూట్స్‌’ షూటింగ్‌ సందర్భంగా టొరంటోలో తొలిసారి హ్యారీ (32), మేఘన్‌ మధ్య చూపులు కలిశాయట.  ఆ తర్వాత తరచూ కలుసుకున్న ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడిందని, అయితే ఇది దీర్ఘకాలం కొనసాగుతుందా? అన్నది ఇప్పుడే చెప్పలేమని ఆ వర్గాలు అంటున్నాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement