సల్మాన్ ను వెంటాడుతున్న కష్టాలు | Petition seeks probe into death of witness in Salman Khan's case | Sakshi
Sakshi News home page

సల్మాన్ ను వెంటాడుతున్న కష్టాలు

Jun 25 2015 4:58 PM | Updated on Sep 3 2017 4:21 AM

సల్మాన్ ను వెంటాడుతున్న కష్టాలు

సల్మాన్ ను వెంటాడుతున్న కష్టాలు

'హిట్ అండ్ రన్' కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.

ముంబై: 'హిట్ అండ్ రన్' కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ రవీంద్ర పాటిల్ మృతిపై దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. పుణేకు చెందిన సామాజిక కార్యకర్త హేమంత్ పాటిల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

రవీంద్రపై సల్మాన్ ఖాన్ ఒత్తిడి తీసుకొచ్చిన విషయం కేసు విచారణ సమయంలో ప్రస్తావనకు రాలేదని గుర్తు చేశారు. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని రవీంద్రపై ఒత్తిడి తెచ్చిన సల్మాన్ పై న్యాయపరమైన చర్య తీసుకోవాలని హేమంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన రోజు పోలీస్ స్టేషన్ లో రవీంద్ర పాటిల్ ఇచ్చిన సాక్ష్యంతోనే ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు జైలుశిక్ష పడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement