పీలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి | Pele discharged from hospital | Sakshi
Sakshi News home page

పీలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

May 10 2015 9:46 AM | Updated on Sep 3 2017 1:48 AM

పీలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

పీలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

బ్రెజిల్ పుట్బాల్ దిగ్గజం పీలే ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్యులు ఆదివారం వెల్లడించారు.

రియో డి జెనీరో : బ్రెజిల్ పుట్బాల్ దిగ్గజం పీలే ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్యులు ఆదివారం వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వారు తెలిపారు.  ప్రొస్టెట్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన్ని ఇటీవల కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు. దాంతో ఆయన్ని ఆదివారం డిశ్చార్జి చేశారు.

ఇటీవల పీలే (74)  తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు వైద్యులు పలు శస్త్ర చికిత్సలు చేసిన సంగతి తెలిసిందే. ఫుట్ బాల్ ప్రపంచ కప్ టైటిళ్లను మూడు సార్లు గెలుచుకున్న అరుదైన ఆటగాడిగా పీలే రికార్డు సృష్టించారు.

Advertisement
 
Advertisement
Advertisement