నెల కనిష్టానికి సెన్సెక్స్ | one month sensex to low | Sakshi
Sakshi News home page

నెల కనిష్టానికి సెన్సెక్స్

Mar 11 2015 2:06 AM | Updated on Oct 1 2018 5:28 PM

నెల కనిష్టానికి సెన్సెక్స్ - Sakshi

నెల కనిష్టానికి సెన్సెక్స్

అనుకున్న దానికన్నా ముందే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచేస్తుందన్న భయాలు మంగళవారం కూడా కొనసాగాయి.

అనుకున్న దానికన్నా ముందే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచేస్తుందన్న భయాలు మంగళవారం కూడా  కొనసాగాయి. దీనికి తోడు గురువారం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ), ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనుండటంతో ట్రేడింగ్ మందకొడిగా సాగింది. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 135 పాయింట్లు, నిఫ్టీ 45 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  జూన్ కంటే ముందే ఫెడ్ వడీ  ్డరేట్లను పెంచే అవకాశాలున్నాయన్న ఆందోళనలతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. ఇవే భయాలు మంగళవారమూ కొనసాగాయని, సెంటిమెంట్ బలహీనపడిందని బ్రోకర్లు చెప్పారు.
 
365 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్
సోమవారం నాటి ముగింపు(28,845 పాయింట్లు)తో పోలిస్తే 79 పాయింట్ల లాభంతో బీఎస్‌ఈ సెన్సెక్స్  ప్రారంభమైంది. 28,924 పాయింట్ల వద్ద ఆరంభమైన సెన్సెక్స్ 28,949-28,584 గరిష్ట, కనిష్ట పాయింట్ల మధ్య (365  పాయింట్ల రేంజ్‌లో)కదలాడి చివరకు 135 పాయింట్ల(0.47 శాతం) నష్టంతో 28,710 పాయింట్ల వద్ద ముగిసింది.  ఇది నెల రోజుల కనిష్టం. నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 8,712 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోనే ప్రారంభమైనా,  మధ్యాహ్నం ట్రేడింగ్‌లో కీలకమైన షేర్లలో భారీ లాభాల స్వీకరణ కారణంగా  నష్టాల్లోకి జారిపోయింది. అయితే ట్రేడింగ్ చివర్లో స్వల్పస్థాయిలో కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలతో గట్టెక్కాయి.
 
క్యాపిటల్ మార్కెట్‌లో లావాదేవీలు
 బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ ట్రేడింగ్
 
 విభాగం        తేదీ                 కొనుగోలు        అమ్మకం        నికర విలువ
 డీఐఐ :        10-03                 1,873             1,583           290    
                  09-03                 1,486             1,522          - 35
 ఎఫ్‌ఐఐ:       10-03                  4,292              5,040        - 748                                                 

                   09-03                  5,752             4,914           838
                                                                                 (విలువలు రూ.కోట్లలో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement