బీఎస్ఎన్ఎల్ నుంచి ఉచిత కాల్స్ | non stop free calls from bsnl to any network | Sakshi
Sakshi News home page

బీఎస్ఎన్ఎల్ నుంచి ఉచిత కాల్స్

Apr 23 2015 3:32 PM | Updated on Oct 16 2018 2:49 PM

బీఎస్ఎన్ఎల్ నుంచి ఉచిత కాల్స్ - Sakshi

బీఎస్ఎన్ఎల్ నుంచి ఉచిత కాల్స్

దేశంలోని అతి పెద్ద నెట్ వర్క్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త ఆఫర్తో ముందుకు రాబోతుంది.

హైదరాబాద్: దేశంలోని అతి పెద్ద నెట్ వర్క్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త ఆఫర్తో ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు పలు నెట్ వర్క్లు ఎంతోకొంత చెల్లించడంతో సెల్ ఫోన్ ద్వారా రాత్రి వేళలో నాన్ స్టాప్ గా  ఉచితంగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వగా.. బీఎస్ఎన్ఎల్ మాత్రం అంతకంటే మించిన పథకాన్ని ప్రారంభించబోతుంది.

రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు పూర్తి ఉచితంగా ఏ నెట్ వర్క్ కు అయినా ఫోన్ కాల్ చేసి నిరంతరం మాట్లాడుకునే అవకాశాన్ని ఇవ్వనుంది. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకాన్ని మే 1 నుంచి ప్రారంభించనుంది.  అయితే, ఈ అవకాశం మాత్రం ల్యాండ్ ఫోన్ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇప్పటికే అన్ని రకాల ప్లాన్స్తో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ల్యాండ్ ఫోన్లు వాడే వారందరికీ ఇది వర్తిస్తుందని ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement