నోకియా స్మార్ట్‌ఫోన్ బుకింగ్స్ అదుర్స్‌! | Nokia 6 manages 2,50,000 registrations in less than 24 hours | Sakshi
Sakshi News home page

నోకియా స్మార్ట్‌ఫోన్ బుకింగ్స్ అదుర్స్‌!

Jan 13 2017 4:00 PM | Updated on Sep 5 2017 1:11 AM

నోకియా స్మార్ట్‌ఫోన్ బుకింగ్స్ అదుర్స్‌!

నోకియా స్మార్ట్‌ఫోన్ బుకింగ్స్ అదుర్స్‌!

నోకియా స్మార్ట్‌ఫోన్లకు క్రేజ్ తగ్గలేదు. మార్కెట్లోకి రీ–ఎంట్రీ ఇచ్చిన నోకియాకు వినియోగదారులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.

బీజింగ్: నోకియా స్మార్ట్‌ఫోన్లకు క్రేజ్ తగ్గలేదు. మార్కెట్లోకి రీ–ఎంట్రీ ఇచ్చిన నోకియాకు వినియోగదారులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. నోకియా–6 పేరుతో కంపెనీ తొలి ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌  చైనాలో ఆవిష్కరించింది. ఆన్ లైన్ రిటైలర్ జేడీ డాట్ కామ్ ద్వారా ఈ ఫోన్లను విక్రయించనున్నారు. ఇప్పటికే ముందుస్తు అమ్మకాలు ప్రారంభించగా అనూహ్య స్పందన వచ్చింది. నోకియా–6 స్మార్ట్ ఫోన్ కొనేందుకు ఆసక్తి చూపిస్తూ 24 గంటల్లో 2,50,000 మంది రిజిస్టేషన్ చేసుకున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. జనవరి 19 నుంచి నోకియా–6 స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రానుంది.

మొబైల్ కాంగ్రెస్ వరల్డ్(ఎండబ్ల్యూసీ) ఒకరోజు ముందు ఫిబ్రవరి 26న మరిన్ని స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టాలని హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్లాన్ చేస్తోంది. మైక్రోసాఫ్ట్‌ నుంచి నోకియా బ్రాండ్‌ లైసెన్సింగ్‌ హక్కులను ఫిన్లాండ్‌కు చెందిన హెచ్‌ఎండీ గ్లోబల్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. నోకియా ఫోన్లను ఫాక్స్‌కాన్‌ తయారు చేస్తోంది.

నోకియా 6 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు
ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌
5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్ ప్లే
2.5 డి గొరిల్లా గ్లాస్
ఆండ్రాయిడ్‌ నోగట్‌ 7.0 ఓఎస్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ప్రాసెసర్‌
4 జీబీ ర్యామ్‌
64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
డ్యూయల్‌ సిమ్‌
కెమెరా: వెనక 16 మెగాపిక్సెల్స్‌, ముందు 8 మెగాపిక్సెల్స్‌
డాల్బీ అట్మోస్‌ టెక్నాలజీ డ్యూయల్‌ యాంప్లిఫయర్స్
ధర: దాదాపు రూ. 16,750

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement