నోకియా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌, మీరే రిపేర్‌ చేసుకోవచ్చు! | Sakshi
Sakshi News home page

నోకియా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌, మీరే రిపేర్‌ చేసుకోవచ్చు!

Published Sat, Feb 25 2023 9:12 PM

Nokia launches smartphone you can fix yourself repair  - Sakshi

సాక్షి, ముంబై: నోకియా అద్భుతమైన ఫోన్‌ను పరిచయం చేసింది. రిపేరబుల్ బడ్జెట్ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను విడుదల చేసింది.రీసైకిల్ చేసుకునేలా ప్లాస్టిక్ బ్యాక్‌ కవర్‌, బ్యాటరీ మార్చుకునే అవకాశంతో  తీసుకొస్తోంది. ఐఫిక్స్‌ట్‌ భాగస్వామ్యంతో టూల్స్, రిపేర్ గైడ్‌తో సహా అందిస్తోంది.  తద్వారా యూజర్‌  ఫోన్ వెనుక కవర్, బ్యాటరీ, స్క్రీన్ ఛార్జింగ్ పోర్ట్‌ను  రిపేర్‌ చేసుకోవచ్చు. డిస్‌ప్లే పాడైపోయినా, ఛార్జింగ్ పోర్ట్  వంగిపోయినా,  లేదా బ్యాటరీ పాడైపోయినా, సరసమైన ధరల్లో సొంతంగా యూజర్లే మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది.

రిపేర్ గైడ్‌ సాయంతో ఇంట్లోనే మరమ్మతులు చేయడానికి రూపొందించిన తొలి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఇది అని కంపెనీ ప్రకటించింది. నోకియా జీ22 పేరుతో శనివారం బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌కు ముందు లాంచ్‌ చేసింది.  జీ22లో ఆటో క్లీనప్ అని పిలువబడే ఆప్టిమైజేషన్ అసిస్టెంట్‌ను  కూడా జోడించింది.

నోకియా ఫోన్‌ల తయారీదారు హెచ్‌ఎండీ గ్లోబల్ ప్రొఫెషనల్ రిపేర్ ఆప్షన్‌లతో పాటు ఫిక్సిట్‌ ద్వారా ఐదేళ్లపాటు "క్విక్ ఫిక్స్" రిపేర్ గైడ్స్‌, ఇతర స్పేర్‌ పార్ట్స్‌ అందుబాటులో ఉంచుతుందని HMD గ్లోబల్  ప్రొడక్షన్‌ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గూసన్ అన్నారు. ఇందులోని బిగ్‌ బ్యాటరీ  లైఫ్‌ మూడు రోజులట.

 మార్చి 8నుంచి యూకే లోసేల్స్‌ మొదలు. నోకియా జీ 22  ధర సుమారు  రూ.15 వేలు (179.19 డాలర్లు) 
 

నోకియా జీ 22 ఫీచర్లు 
6.53 అంగుళాల స్క్రీన్‌
ఆండ్రాయిడ్‌ 12
128జీబీ స్టోరేజ్‌
50+2+2 ట్రిపుల్‌ రియర్ కెమెరా
8  ఎంపీ సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ స్కానర్‌
5,050mAh క్విక్‌ఫిక్స్ రిపేరబుల్ బ్యాటరీ

మరో రెండు ఫోన్లు కూడా 
ఒకటి కాదు రెండుకాదు మూడు అంటూ నోకియా జీ22, సీ32, సీ 2 ఫోన్లను ట్విటర్‌లో షేర్‌ చేసింది.  HMD గ్లోబల్ పత్రికా ప్రకటన ప్రకారం నోకియా మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది.   
 
నోకియా  సీ 32 
 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 13
50+2 ఎంపీ రియర్‌ కెమెరా
5,000mAh బ్యాటరీ10 వాట్స్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ 
చార్‌కోల్, ఆటం గ్రీన్ , బీచ్ పింక్ కలర్స్‌లో లభ్యం
2 జీబీ ర్యామ్‌, 64 జీబీస్టోరేజ్‌
3 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ 
 ధర  £129.99 వద్ద ప్రారంభం (సుమారు రూ.13 వేలు)

నోకియా సీ22 
6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 13 గో
13+2  ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 
8ఎంపీ  సెల్ఫీ కెమెరా
5,000mAh బ్యాటరీ 10W ఛార్జింగ్‌ సపోర్ట్‌
2 జీబీ ర్యామ్‌, 64 జీబీస్టోరేజ్‌
3 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ 
ప్రారంభ ధర £109.99 (సుమారు రూ. 11 వేలు) 

Advertisement
 
Advertisement
 
Advertisement