నోకియా ఎక్స్‌30 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌, ధర విని షాక్‌ అవ్వకండి!

Nokia X30 5G with Snapdragon 695 launched in India - Sakshi

సాక్షి, ముంబై:   ప్రముఖ మొబైల్‌ తయారీదారు  నోకియా  సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం లాంచ్‌ చేసింది.   నోకియా ఎక్స్‌ 30 4జీ’ పేరుతో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్, ప్రకటించింది. దీని ధర రూ. 48999.  నోకియా  అధికారిక వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 20  అందుబాటులో ఉంటుంది. 

నోకియా ఎక్స్‌ 30 4జీ ఫీచర్లు
6.43 అంగుళాల AMOLED డిస్‌ప్లే
స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్
Android 12, 1080 x 2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌  
క్వాల్కం SM6375 స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌
8 జీబీ ర్యామ్‌, 256 జీజీ స్టోరేజ్‌ 
50+13ఎంపిడ్యుయల్‌ రియర్‌  కెమెరా 
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
4,200ఎంఏహెచ్‌ బ్యాటరీ 

లాంచ్‌ ఆఫర్లు
 నోకియా వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే  రూ. 1,000 తగ్గింపు
ఉచిత నోకియా కంఫర్ట్ ఇయర్‌బడ్స్ విలువ రూ. 2,799
 రూ. 2,999 33వాట్స్‌  ఛార్జర్ విలువ
ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌ ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా రూ. 4000 తగ్గింపు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top