చెడు బ్యాక్టీరియాతో యుద్ధానికి సరికొత్త మార్గం | New defense mechanism against bacteria discovered | Sakshi
Sakshi News home page

చెడు బ్యాక్టీరియాతో యుద్ధానికి సరికొత్త మార్గం

May 8 2017 1:33 PM | Updated on Apr 3 2019 4:22 PM

శరీరానికి తగిలిన గాయం నయమయ్యే క్రమంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా శరీరం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న రహస్యాన్ని పరిశోధకులు చేధించారు.

లండన్‌: శరీరానికి తగిలిన గాయం నయమయ్యే క్రమంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా శరీరం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న రహస్యాన్ని పరిశోధకులు చేధించారు. హానికరమైన బ్యాక్టీరియాను ఎదుర్కొనేందుకు నూతన మార్గాలను అన్వేషించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడు తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా రక్తంలోని ప్లాస్మాలో కనిపించని, కేవలం గాయపడిన ప్రదేశంలో మాత్రమే కనిపించే ‘త్రోంబిన్‌’అనే బ్లడ్‌ ప్రోటీన్‌ బ్యాక్టీరియా, టాక్సిన్స్‌ను ఒక సమూహంగా ఏర్పరుస్తుందని అధ్యయనంలో వెల్లడైనట్లు వారు తెలిపారు.

ఈ సమూహం ప్రక్రియ చాలా త్వరగా జరగడంతోపాటు ఇలా సమూహంగా ఏర్పడిన బ్యాక్టీరియా, టాక్సిన్స్‌ను శరీరంలోని పాడైన కణాలు తినేలా ప్రేరేపిస్తుందని వెల్లడించారు. మామూలుగా బ్యాక్టీరియా, టాక్సిన్స్‌ను నాశనం చేసే కంటే యాంటిబయాటిక్స్‌తో సమూహంగా చేరిస్తేనే మంచిదని, తర్వాత శరీరం వాటిని నాశనం చేస్తుందని స్వీడన్‌లోని లండ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జిట్కా పెటర్లోవా స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement