బీజేపీకి వత్తాసు పలకలేదు:షీలా దీక్షిత్ | Never backed BJP to form Delhi govt, Sheila Dikshit | Sakshi
Sakshi News home page

బీజేపీకి వత్తాసు పలకలేదు:షీలా దీక్షిత్

Sep 14 2014 3:08 PM | Updated on Mar 29 2019 9:24 PM

బీజేపీకి వత్తాసు పలకలేదు:షీలా దీక్షిత్ - Sakshi

బీజేపీకి వత్తాసు పలకలేదు:షీలా దీక్షిత్

ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమివ్వాలని, ఢిల్లీ ప్రజలకు కూడా అది మంచిదని వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ ఇప్పుడు ఆత్మసంరక్షణలో పడ్డారు.

ఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమివ్వాలని, ఢిల్లీ ప్రజలకు కూడా అది మంచిదని వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ ఇప్పుడు ఆత్మసంరక్షణలో పడ్డారు.  ఢిల్లీలో బీజేపీ సర్కారుకు జైకొట్టిన ఆమె మాటమార్చారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తాను ఎప్పుడూ కోరలేదని స్పష్టం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం సృష్టించడంతో దానిని సరిదిద్దుకునే పనిలో పడ్డారు.

 

'ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు తాను అనుకూలంగా ఎప్పుడూ మాట్లడలేదు. ఆ రకంగా ఎప్పటికీ వ్యాఖ్యానించను' అని షీలా తెలిపారు.  ఆ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి తగిన సంఖ్యా బలం ఉంటే  ఇబ్బంది ఏమిటని మాత్రమే తాను చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వాన్నే ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఒకవేళ బీజేపీ ఆ అవకాశం ఉంటే ప్రభుత్వ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆమె వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement