ఆర్టికల్ 370పై చర్చించాల్సిందే: బీజేపీ | Need to debate on Article 370: BJP | Sakshi
Sakshi News home page

ఆర్టికల్ 370పై చర్చించాల్సిందే: బీజేపీ

Jan 19 2014 9:27 PM | Updated on Mar 29 2019 9:18 PM

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370పై చర్చించాల్సిన అవసరముందని బీజేపీ మరోసారి ఈ విషయాన్ని లేవనెత్తింది.

జమ్మూ: జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370పై చర్చించాల్సిన అవసరముందని బీజేపీ మరోసారి ఈ విషయాన్ని లేవనెత్తింది.  ఈ అంశంపై చర్చించేందుకు రావాలని అధికార నేషనల్ కాన్ఫరెన్స్తో పాటు రాష్ట్రంలోని ఇతర పార్టీలు రావాలని సవాల్ చేసింది. దేశంతో రాష్ట్ర సమైక్యతకు ఈ ఆర్టికల్ అవరోధం కలిగిస్తోందని జమ్మూకాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు జుగల్ కిశోర్ శర్మ రాజకీయ సలహాదారు హరి ఓమ్ చెప్పారు. చర్చలో పాల్గొనని వారికి దీనిపై ఓ వైఖరి లేదని విమర్శించారు. ఇలాంటి తప్పుడు విధానాల వల్ల జమ్మూ, కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లోని హిందువులు, సిక్కులు వంటి మైనారిటీలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

ఇటీవల జమ్మూలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా ఆర్టికల్ 370 గురించి ప్రస్తావించారు. ఆ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఆర్టికల్ 370కి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరగాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. సభలో మోడీ కన్నా ముందు ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. ఆయన కూడా ఆర్టికల్ 370తో రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగిందని నిర్ధారణ అయితే, అందుకనుగుణంగా తమ విధానాన్ని మార్చుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement