నళినికి 12 గంటల పెరోల్ | nalini granted 12 hours parol to attend father's funeral | Sakshi
Sakshi News home page

నళినికి 12 గంటల పెరోల్

Feb 25 2016 3:40 AM | Updated on Sep 3 2017 6:20 PM

నళినికి 12 గంటల పెరోల్

నళినికి 12 గంటల పెరోల్

రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషి నళినికి 12 గంటల పెరోల్ లభించింది. ఆమె తండ్రి మరణించడంతో.. అంత్యక్రియలలో పాల్గొనేందుకు వీలుగా ఆమెకు ఈ పెరోల్ మంజూరు చేశారు.

తండ్రి అంత్యక్రియలకు హాజరు
సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళినీ శ్రీహరన్‌కు ఆమె తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బుధవారం 12 గంటల పెరోల్ మంజూరైంది. పెరోల్‌పై ఆమె వేలూరు జైలు నుంచి చెన్నైకి చేరుకుని తండ్రి శంకర నారాయణ్(91) అంత్యక్రియలకు హాజరయ్యారు. తర్వాత మళ్లీ జైలుకు వెళ్లారు.2004లో తన సోదరుడి పెళ్లికి పెరోల్‌పై విడుదలైన నళిని ఆ తర్వాత బయటి ప్రపంచాన్ని చూడడం ఇదే తొలిసారి. రాజీవ్ హత్య కేసులో ఆమెకు 1998లో ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించగా, 2000లో రాష్ట్ర గవర్నర్ ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement