నళిని కుమార్తె ఇండియా రాకలో ఆలస్యం | Nalini Petition on Parole Extended | Sakshi
Sakshi News home page

నళిని కుమార్తె హరిద్ర ఇండియా రాకలో ఆలస్యం

Aug 16 2019 7:36 AM | Updated on Aug 16 2019 7:36 AM

Nalini Petition on Parole Extended - Sakshi

నళిని (ఫైల్‌)

వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు ముద్దాయి నళిని నెల పెరోల్‌పై వచ్చి వేలూరు సమీపంలోని సత్‌వచ్చారిలో ఉంటున్నారు. గత నెల  20న వేలూరు రంగాపురంలోని పులవర్‌ నగర్‌లో ద్రావిడ సిద్ధాంతాలకు చెందిన తమిళ పేరవై రాష్ట్ర జాయింట్‌ కార్యదర్శి సింగరాయర్‌ ఇంటిలో ఉంటున్న విషయం తెలిసిందే.   ఇదిలాఉండగా కోర్టు నిబంధన మేరకు నళిని ప్రతిరోజూ ఉదయం సత్‌వచ్చారిలోని పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేస్తున్నారు. నళిని కుమార్తె హరిద్ర వివాహ ఏర్పాట్ల కోసం పెరోల్‌పై బయటకు వచ్చిన నళినితో ఆమె తల్లి పద్మ కూడా ఉంటున్నారు. ఈ సందర్భంగా నళిని తల్లి పద్మ మాట్లాడుతూ మనవరాలు హరిద్ర వివాహ ఏర్పాట్లు చేసేందుకు నళిని బయటకు వచ్చారని నెల రోజుల్లోనే మనుమరాలికి నలుగురిని ఎంపిక చేశామని హరిద్ర ఇండియాకు వచ్చిన వెంటనే నలుగురి ఫొటోలను చూపించి నిర్ణయించనున్నామన్నారు. లండన్‌లో ఉన్న హరిద్రకు సెప్టెంబర్‌ దాకా పరీక్షలు ఉన్నందున ఇండియాకు రావడంలో ఆలస్యం అవుతోందన్నారు. పరీక్షలు అయిన వెంటనే ఈమె తమిళనాడుకు రానున్నారని తెలిపారు. మరో నెల రోజుల పాటు పెరోల్‌ ఇవ్వాలని నళిని న్యాయవాది ఆధ్వర్యంలో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నామన్నారు. పెరోల్‌ పొడిగింపుపై జైలు అధికారులు మాట్లాడుతూ ఇప్పటికే నళినికి కోర్టు నెల పెరోల్‌ ఇచ్చిందని పొడిగించాలా వద్దా అనే దానిపై కోర్టు నిర్ణయించాల్సిన ఉందన్నారు. కోర్టు పెరోల్‌ పొడిగించకుంటే ఈనెల 25న సాయంత్రం 5 గంటలలోపు నళిని వేలూరు మహిళా జైలుకు రావాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement