breaking news
fathers funeral
-
నళినికి 12 గంటల పెరోల్
తండ్రి అంత్యక్రియలకు హాజరు సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళినీ శ్రీహరన్‌కు ఆమె తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బుధవారం 12 గంటల పెరోల్ మంజూరైంది. పెరోల్‌పై ఆమె వేలూరు జైలు నుంచి చెన్నైకి చేరుకుని తండ్రి శంకర నారాయణ్(91) అంత్యక్రియలకు హాజరయ్యారు. తర్వాత మళ్లీ జైలుకు వెళ్లారు.2004లో తన సోదరుడి పెళ్లికి పెరోల్‌పై విడుదలైన నళిని ఆ తర్వాత బయటి ప్రపంచాన్ని చూడడం ఇదే తొలిసారి. రాజీవ్ హత్య కేసులో ఆమెకు 1998లో ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించగా, 2000లో రాష్ట్ర గవర్నర్ ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. -
అంతిమ ‘సంస్కారాన్ని’ మరిచిన కొడుకు
మృతుడు బలపాలవాసి ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఘటన దహన సంస్కారాలు నిర్వహించిన కూతుళ్లు కారేపల్లి : కన్నతండ్రి అంత్యక్రియలు చేయడం భారంగా భావించాడో కొడుకు. కనీసం కడసారి చూపునకు కూడా రాకుండా..కర్కశంగా వ్యవహరించాడు. అరుుతే కూతురు మాత్రం అన్నీతానై తండ్రికి తలకొరివి పెట్టింది. ఈ ఘటన కారేపల్లి మండలంలోని మొట్లగూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా బలపాల గ్రామానికి చెందిన రాయల పిచ్చయ్య(75)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా నెల రోజుల క్రితం బలపాలలో తన ఇంట్లో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంలో తన చిన్న కుమారుడు రాయల శ్రీనివాసరావు మృతిచెందగా, రాయల పిచ్చయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పెద్దకుమారుడు తండ్రిని పట్టించుకోకుండా వదిలేశాడు. కారేపల్లి మండలం మాణిక్యారం గ్రామపంచాయతీ మొట్లగూడేనికి చెందిన తన చిన్నకుమార్తె గుర్రం మంగమ్మ తండ్రిని, పెద్ద కుమార్తె రాయల వెంకటనర్సమ్మను ఇంటికి తీసుకొచ్చి బాగోగులు చూసుకుంటోంది. ఈ క్రమంలో పిచ్చ య్య మృతిచెందడంతో పెద్ద కుమారుడికి కబురు చేశారు. అతడు తండ్రిని చివరి చూపు చూడడానికి సైతం రాలేదు. దీంతో అవివాహితురాలైన రాయల వెంకటనర్సమ్మ తండ్రికి తలకొరివి పెట్టిం ది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు.