చుట్టూ అలా.. మధ్యలో ఇలా! | nail houses becoming bone of contention in china | Sakshi
Sakshi News home page

చుట్టూ అలా.. మధ్యలో ఇలా!

Jul 22 2015 3:24 PM | Updated on Aug 13 2018 3:53 PM

నెయిల్ హౌస్.. ఈ పేరు ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? చైనాలో ఈ తరహా ఇళ్లు చాలానే ఉన్నాయి.

నెయిల్ హౌస్.. ఈ పేరు ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? చైనాలో ఈ తరహా ఇళ్లు చాలానే ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే.. ఒక ప్రాంతంలో చుట్టుపక్కల అంతా బాగా అభివృద్ధి చెంది, ఒక్క ఇల్లు మాత్రమే అడ్డంగా ఉండిపోవడం. సదరు ఆస్తికి వాళ్లు ఇవ్వదలచిన పరిహారం తక్కువని యజమానులు భావించడమే అందుకు కారణం. ఇలాంటి ఇళ్లు చైనాలోని మంచి రేడియల్ రోడ్ల మధ్య, పెద్దపెద్ద షాపింగ్ కాంప్లెక్సుల ముందు, రోడ్డు మధ్యన... ఇలా అనేక చోట్ల ఉంటున్నాయి.

ఆ ఇంటి యజమాని తనకు ఇవ్వదలచిన పరిహారం సరిపోలేదని భావించి, ఒప్పందం కుదుర్చుకోకపోతే.. ఆ ఇల్లు అలా వదిలేయాల్సిందే. ఇక్కడలా బలవంతపు భూసేకరణ లాంటి అస్త్రాలు ప్రయోగించే వీలు ఉన్నట్లు లేదు. దాంతో ఈ తరహా ఇళ్లు అలా కంటిలో నలుసులా.. అలా మిగిలిపోతూనే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement