మా అబ్బాయి 'గే' కాదు
ఎయిమ్స్ వైద్యురాలు ప్రియావేది ఆత్మహత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. తన కొడుకు డాక్టర్ కమల్ వేది 'గే' కాదని అతడి తండ్రి మహేష్ వాదిస్తున్నారు.
ఎయిమ్స్ వైద్యురాలు ప్రియావేది ఆత్మహత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. తన కొడుకు డాక్టర్ కమల్ వేది 'గే' కాదని అతడి తండ్రి మహేష్ వాదిస్తున్నారు. కమల్, ప్రియల మధ్య శారీరక సంబంధం లేని విషయం తమకు కూడా తెలుసని.. అయితే వాళ్లిద్దరూ ఎప్పుడూ కొట్టుకోవడం వల్లే అలా జరిగేదని ఆయన అన్నారు. ప్రియకు కోపం చాలా ఎక్కువ వస్తుందని, ఆమె కోపం చూసి తాము కూడా భయపడేవాళ్లమని మహేష్ అన్నారు.
తన భర్త 'గే' అని, ఎప్పుడూ గే పోర్న్ సినిమాలు చూసేవాడని ఎయిమ్స్ వైద్యురాలు ప్రియావేది తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసి మణికట్టు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన కొడుకు స్వార్థపరుడు కానే కాదని, ఇంటికి ఎవరు వచ్చినా వాళ్లకు ఉచితంగా చికిత్స చేసేవాడని మహేష్ వేది అన్నారు. ప్రియ ఎండీ కోర్సు చేసేటప్పుడు పాథాలజీ నుంచి ఎనస్థీషియాకు మారాలంటే ఆమెకు 5 లక్షల రూపాయలు ఇచ్చాడని కూడా మహేష్ వేది చెప్పారు.


