బాదౌన్ హత్యాచార ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయంను బీజేపీ నేత, మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ వెనకేసుకొచ్చారు.
న్యూఢిల్లీ: బాదౌన్ హత్యాచార ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయంను బీజేపీ నేత, మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ వెనకేసుకొచ్చారు. తండ్రీకొడుకులను ఆయన నిస్సహాయులుగా వర్ణించారు. అత్యాచారాల నిరోధానికి వారేం చేయగలరు అంటూ ఎదురు ప్రశ్నించారు. పురుషుడు మానసిక సమతుల్యం తప్పినప్పుడే అత్యాచారానికి పాల్పడతాడని సూత్రీకరించారు.
గత నెల 27న ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ సమీపంలో కాట్రా గ్రామంలో అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు బాలికలపై కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని చెట్టుకు ఉరేసి ప్రాణాలను బలి తీసుకున్నారు.