చంటోడిని కారులో వదిలి.. నైట్క్లబ్బుకు వెళ్లిన తల్లి! | Mother arrested for leaving toddler in car to go to a night club | Sakshi
Sakshi News home page

చంటోడిని కారులో వదిలి.. నైట్క్లబ్బుకు వెళ్లిన తల్లి!

Jun 25 2014 12:51 PM | Updated on Sep 2 2017 9:23 AM

పిల్లాడి కంటే ఆ మహాతల్లికి నైట్క్లబ్బే ఎక్కువ అయిపోయింది. మూడేళ్ల కొడుకును వేడిగా ఉన్న కారులో ఒంటరిగా వదిలిపెట్లి, క్లబ్బుకు వెళ్లిన ఆ తల్లిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.

పిల్లాడి కంటే ఆ మహాతల్లికి నైట్క్లబ్బే ఎక్కువ అయిపోయింది. మూడేళ్ల కొడుకును వేడిగా ఉన్న కారులో ఒంటరిగా వదిలిపెట్లి, క్లబ్బుకు వెళ్లిన ఆ తల్లిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఈశాన్య హారిస్ కౌంటీకి చెందిన  ఉజ్మా షేక్ అనే మహిళ తన పిల్లవాడితో సహా నైట్ క్లబ్బులోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే, తలుపు వద్ద ఉన్న కాపలాదారు.. ఆమెను లోనికి వెళ్లనివ్వలేదు. దాంతో వెనక్కి తిరిగి వెళ్లి, ఈసారి ఒంటరిగా వచ్చింది.

తన స్నేహితురాలి వద్ద పిల్లాడిని వదిలిపెట్టినట్లు అతడికి చెప్పింది. దాంతో ఆ కాపలాదారుకు అనుమానం వచ్చి, కారు వద్దకు వెళ్లాడు. తీరా చూస్తే కారులో పిల్లాడు ఒంటరిగా ఉన్నాడు. పిల్లాడిని నిర్లక్ష్యంగా అలా వదిలేసినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేసి.. తర్వాత 1.20 లక్షల రూపాయల బాండు సమర్పించడంతో వదిలిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement