మహిళలతో పోలిస్తే పురుషులే ఇంటర్నెట్ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళల కంటే 20 కోట్ల మంది పురుషులు ఎక్కువగా నెట్ను వాడుతున్నారు.
మహిళలతో పోలిస్తే పురుషులే ఇంటర్నెట్ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళల కంటే 20 కోట్ల మంది పురుషులు ఎక్కువగా నెట్ను వాడుతున్నారు. ఐక్యరాజ్య సమితి (యూఎన్) తాజా నివేదికలో ఈ విషయం తేలింది. ప్రపంచంలో మొత్తం 280 కోట్ల మంది నెటిజెన్లు ఉన్నట్టు తెలియజేసింది. వీరిలో 150 కోట్ల మంది పురుషులు, 130 కోట్ల మంది మహిళలు ఉన్నట్టు వెల్లడించింది.
నెట్ వాడకంలో మహిళలు, పురుషుల మధ్య అంతరం వచ్చే మూడేళ్లలో మరింత (35 కోట్లు) పెరగనుందని యూఎన్ బ్రాడ్బాండ్ కమిషన్ నివేదికలో పేర్కొంది. మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా కంప్యూటర్ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. సంపన్న వర్గంలోనూ పురుషులదే పైచేయని తెలియజేసింది.