సియాచిన్ వెళుతున్న మోదీ | Modi visits Siachen to meet soldiers on Diwali | Sakshi
Sakshi News home page

సియాచిన్ వెళుతున్న మోదీ

Oct 23 2014 9:50 AM | Updated on Aug 15 2018 2:20 PM

సియాచిన్ వెళుతున్న మోదీ - Sakshi

సియాచిన్ వెళుతున్న మోదీ

శ్రీనగర్ వెళ్లముందు ప్రధాని నరేంద్ర మోదీ సియాచిన్ లో పర్యటిస్తారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకాశ్మీర్ లో దీపావళి జరుపుకోనున్నారు. ఇందుకోసం ఆయన శ్రీనగర్ కు వెళ్లనున్నారు. అయితే శ్రీనగర్ వెళ్లముందు ఆయన సియాచిన్ లో పర్యటిస్తారు. అక్కడ కొంతసేపు సైనికులతో గడపనున్నారు. తద్వారా ప్రతి భారతీయుడు సైనికులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారన్న సందేశం ఇవ్వనున్నారు. సియాచిన్ కు బయలుదేరేముందు ఈ విషయాన్ని మోదీ ట్వీట్ చేశారు.

వరదల కారణంగా నిరాశ్రయులైన వేలాదిమంది కాశ్మీరీలకు భరోసా కల్పించేందుకు దీపావళికి అక్కడ గడపాలని మోదీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement