ప్రేమించలేదని.. కాల్చి చంపేశాడు! | Minor shot dead by jilted lover in UP | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని.. కాల్చి చంపేశాడు!

May 9 2015 2:58 PM | Updated on Sep 3 2017 1:44 AM

ప్రేమించలేదని.. కాల్చి చంపేశాడు!

ప్రేమించలేదని.. కాల్చి చంపేశాడు!

తనను ప్రేమించలేదన్న కోపంతో 16 ఏళ్ల అమ్మాయిని కాల్చి చంపేశాడో ప్రేమికుడు.

తనను ప్రేమించలేదన్న కోపంతో 16 ఏళ్ల అమ్మాయిని కాల్చి చంపేశాడో ప్రేమికుడు. అనంతరం నేరుగా వెళ్లి పోలీసుల వద్ద లొంగిపోయాడు. హిమాంశి అనే అమ్మాయి 8వ తరగతి చదువుతోంది. యోగేంద్ర (22) అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు.  ఆమె నిరాకరించడంతో పాటు పెద్దలకు ఫిర్యాదు చేయడంతో స్కూలు నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆమెను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడికి ఓ బ్యూటీపార్లర్ ఉంది. అతడు తరచు తన వెంటపడుతున్నాడని హిమాంశు తన తాత బల్జీత్ సింగ్ తదితరులకు చెప్పింది. దాంతో వాళ్లు యోగేంద్ర కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో అతడికి కోపం వచ్చి ఆమెను కాల్చి చంపేశాడు. తర్వాత సమీపంలోని పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. అతడిపై హత్యకేసు నమోదుచేసి జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement