ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థినిని తుపాకీతో కాల్చి పరార్‌! | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది ఘాతుకం..15ఏళ‍్ల బాలికను తుపాకీతో కాల్చి పరార్‌!

Published Thu, Aug 18 2022 10:32 AM

Bihar Girl Student Shot In Neck By Man Over Love Affair - Sakshi

పాట్నా: తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది 15 ఏళ్ల బాలికను దారికాచి తుపాకీతో కాల్చాడు. మెడపై తూటా దిగటంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది బాధితురాలు. ఈ దుశ్చర్య బిహార్‌ రాజధాని పాట్నాలో బుధవారం జరిగింది. బాలికపై తుపాకీ పేల్చుతున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

బ్యూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇంద్రపురి ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. కూరగాయలు విక్రయించే వ్యక్తి కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ వ‍్యక్తి ప్రేమించాలని వెంటపడుతున్నాడు. అతడి ప్రేమను తిరస్కరించిందనే కోపంతో తుపాకీతో వచ్చాడు. బాలిక అతడితో మాట్లాడకుండా వెళ్లగా వెనక నుంచి మెడపై కాల్చాడు. తూటా దిగటంతో బాలిక అక్కడే పడిపోయింది. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యువతి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: లఖింపుర్‌లో 72 గంటల ఆందోళన.. యూపీకి 10వేల మంది రైతులు

Advertisement
 
Advertisement
 
Advertisement