breaking news
girl shot dead
-
ఆరేళ్ల బాలుడి కాల్పులు.. ఐదేళ్ల చెల్లి మృతి!
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇండియానాపొలిస్ నగరం సమీపంలోని మున్సీ పట్టణంలో ఘోరంగా జరిగింది. ఆరేళ్ల బాలుడు ఇంట్లో ఐదేళ్ల తన చెల్లిని తుపాకీతో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన బాలిక కన్నుమూసింది. ఈ ఘటనలో బాలుడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారుజామున జరిగినట్లు అధికారులు తెలిపారు. బాలిక తలలో తూటా దిగినట్లు చెప్పారు. ఆమెను స్థానిక ఐయూ హెల్త్ బాల్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. సురక్షిత ప్రాంతంలో పెట్టిన రెండు హ్యాండ్ గన్స్‌లో నుంచి ఒకదానిని తన ఆరేళ్ల బాలుడు తీసుకున్నట్లు చెప్పారు అరెస్టయిన జాకబ్ గ్రేసన్. తన చెల్లిన కాల్చినట్లు చెప్పారు. నిరక్ష్యంగా వ్యవహరించినందుకు జాకబ్‌తో పాటు ఆయన భార్య కింబెర్లి గ్రేసన్‌ను అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే.. -
ప్రేమించలేదని.. కాల్చి చంపేశాడు!
తనను ప్రేమించలేదన్న కోపంతో 16 ఏళ్ల అమ్మాయిని కాల్చి చంపేశాడో ప్రేమికుడు. అనంతరం నేరుగా వెళ్లి పోలీసుల వద్ద లొంగిపోయాడు. హిమాంశి అనే అమ్మాయి 8వ తరగతి చదువుతోంది. యోగేంద్ర (22) అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు. ఆమె నిరాకరించడంతో పాటు పెద్దలకు ఫిర్యాదు చేయడంతో స్కూలు నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆమెను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి ఓ బ్యూటీపార్లర్ ఉంది. అతడు తరచు తన వెంటపడుతున్నాడని హిమాంశు తన తాత బల్జీత్ సింగ్ తదితరులకు చెప్పింది. దాంతో వాళ్లు యోగేంద్ర కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో అతడికి కోపం వచ్చి ఆమెను కాల్చి చంపేశాడు. తర్వాత సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అతడిపై హత్యకేసు నమోదుచేసి జైలుకు తరలించారు. -
ప్రేమించలేదని తుపాకీతో కాల్చేశాడు..