ప్రధాని మోదీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు | Minister Azam Khan Compares PM Modi to Ravana | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Feb 6 2017 11:01 AM | Updated on Sep 19 2019 8:40 PM

ప్రధాని మోదీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు - Sakshi

ప్రధాని మోదీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్‌ మంత్రి, సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌.. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రాంపూర్: ఉత్తరప్రదేశ్‌ మంత్రి, సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌.. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆజం ఖాన్ నేరుగా పేరు ప్రస్తావించకుండా మోదీని రావణుడితో పోల్చారు.

యూపీ ఎన్నికల ప్రచారంలో ఆజం ఖాన్ మాట్లాడుతూ.. '130 కోట్ల మంది భారతీయులను పరిపాలిస్తున్న రాజు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు లక్నో వెళ్లారు. ఆయన ఓ విషయం మరిచారు. అతిపెద్ద రావణుడు లక్నోలో లేడు, ఢిల్లీలో నివసిస్తున్నారు' అని అన్నారు. ప్రధాని మోదీ సంపన్నుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులు కొనసాగాలంటే సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు. మంత్రి ఆజం ఖాన్ గతంలో కూడా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement