ఎమ్మెల్యే పదవికి పారికర్ రాజీనామా | Manohar Parrikar resigns as Goa MLA | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పదవికి పారికర్ రాజీనామా

Nov 24 2014 9:28 PM | Updated on Sep 2 2017 5:03 PM

ఎమ్మెల్యే పదవికి పారికర్ రాజీనామా

ఎమ్మెల్యే పదవికి పారికర్ రాజీనామా

గోవా ఎమ్మెల్యే పదవికి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాజీనామా చేశారు.

పనాజీ: గోవా ఎమ్మెల్యే పదవికి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాజీనామా చేశారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తరప్రదేశ్ లోని లక్నో నుంచి రాజ్యసభకు ఎంపిక కావడంతో శాసనసభ సభ్యత్వాన్ని ఆయన వదులుకున్నారు.

పారికర్ రాజీనామాను గోవా శాసనసభ స్పీకర్ రాజేంద్ర అర్లేకర్ సోమవారం ధ్రువీకరించారు. ఈనెల 20న పారికర్ రాజీనామా సమర్పించారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పదవికి పారికర్ చేసిన రాజీనామాను ఆమోదించానని, ఇది రేపటి నుంచి అమల్లోకి వస్తుందని స్పీకర్ ప్రకటించారు. మనోహర్ పారికర్ గోవా సీఎం పదవిని వదులుకుని రక్షణ మంత్రి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement