బైక్ ఆసరాతో బతికి.. ఐదు రోజుల తర్వాత బయటకు | Man pulled alive from rubble in Nepal, five days after huge earthquake | Sakshi
Sakshi News home page

బైక్ ఆసరాతో బతికి.. ఐదు రోజుల తర్వాత బయటకు

Apr 30 2015 1:20 PM | Updated on Apr 8 2019 8:07 PM

పెను భూకంపం తాకిడికి దెబ్బతిన్న నేపాల్ శిథిలాల నుంచి చనిపోయిన వారి మృతదేహాలే కాదు.. కొన ఊపిరితో ఉన్నవారు కూడా బయటపడుతున్నారు.

కఠ్మాండు: పెను భూకంపం తాకిడికి దెబ్బతిన్న నేపాల్ శిథిలాల నుంచి చనిపోయిన వారి మృతదేహాలే కాదు.. కొన ఊపిరితో ఉన్నవారు కూడా బయటపడుతున్నారు. దాదాపు ఐదు రోజులు గడిచిన తర్వాత భారీ శిథిలాల కిందనుంచి గురువారం ఓ పద్దెనిమిదేళ్ల యువకుడిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. పెంబా తమాంగ్ అనే యువకుడు భూకంపం వచ్చిన సమయంలో కూలిపోయిన తొమ్మిది అంతస్థుల భవనం కింద పడిపోయాడు.

భవనం కూలిన సమయంలో ఓ బైక్ను ఆసరాగా చేసుకొని దానికింద ఐదురోజులుగా ప్రాణాలు నిలుపుకున్నాడు. రోజువారిగా సహాయక చర్యలు చేపడుతున్నసిబ్బందికి దాహం దాహం అంటూ అతడి కేకలు వినిపించడంతో దాదాపు ఐదుగంటలపాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. అతడికి అక్కడక్కడా గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement