మహిళకు బూతుపదంతో ఈమెయిల్‌ పంపి..! | Man arrested for telling woman employee bad word | Sakshi
Sakshi News home page

మహిళకు బూతుపదంతో ఈమెయిల్‌ పంపి..!

Apr 18 2017 2:06 PM | Updated on Sep 5 2017 9:05 AM

మహిళకు బూతుపదంతో ఈమెయిల్‌ పంపి..!

మహిళకు బూతుపదంతో ఈమెయిల్‌ పంపి..!

మహిళా ఉద్యోగికి అసభ్యంగా బూతుపదంతో ఈమెయిల్‌ పంపిన ఓ ప్రబుద్ధుడు జైలుపాలయ్యాడు.

ముంబై: మహిళా ఉద్యోగికి అసభ్యంగా బూతుపదంతో ఈమెయిల్‌ పంపిన ఓ ప్రబుద్ధుడు జైలుపాలయ్యాడు. గత ఏడాది నవంబర్‌లో 52 ఏళ్ల నిందితుడు 30 ఏళ్ల మహిళా జర్నలిస్టుకు బూతుపదంతో ఈమెయిల్‌ పంపాడు. కొన్ని కారణాలతో అతను పంపిన ఈమెయిల్‌ చూసి షాక్‌ తిన్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, నిందితుడు అప్పటి నుంచి అమెరికాలోనే ఉండిపోయాడు.

భారత పోలీసులు సమన్లు పంపించినా అతను స్పందించలేదు. అతను సోమవారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగా.. లుకౌట్‌ నోటీసులతో కాచుకొని ఉన్న అధికారులు అతన్ని అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై లైంగిక వేధింపులు, మహిళలను అసభ్యంగా దూషించి వేధించడం, పని ప్రదేశాల్లో మహిళలను వేధింపులకు గురిచేయడం​ వంటి పలు అభియోగాలను నమోదుచేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement