మత మార్పిడిపై భార్యను వేధించిన భర్త అరెస్టు | Man arrested for allegedly forcing wife to change religion after posing as Muslim | Sakshi
Sakshi News home page

మత మార్పిడిపై భార్యను వేధించిన భర్త అరెస్టు

Sep 9 2014 5:28 PM | Updated on Sep 2 2017 1:07 PM

భార్యను మతం మార్చుకోవాలంటూ వేధిస్తున్న భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం అజార్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు.

ముజాఫర్ నగర్: భార్యను మతం మార్చుకోవాలంటూ వేధిస్తున్న భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం అజార్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అనంతరం అతను ఇస్లాం మతంలోకి మారాడు. ఆ క్రమంలోనే భార్యను కూడా మతం మారమని వేధింపులకు గురిచేయసాగాడు. అతని వేధింపుల్ని భరించలేని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో భార్యను కొట్టడమే కాకుండా, చిత్రహింసలకు గురి చేశాడని ఎస్ఐ ప్రమోద్ పవార్ తెలిపారు.

 

ఈ జంట 2014 జూన్ 15 వ తేదీన పెళ్లి చేసుకున్నారని స్పష్టం చేశారు. అయితే అతను పెళ్లి చేసుకున్నఅనంతరం మత మార్పిడి చేసుకున్నాడన్నారు. దీనికి సంబంధించి సోమవారం అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement