స్కూలు భవనంపై కూలిన హెలికాప్టర్‌ | Malaysia Military Helicopter Crashes Into A School, 22 Injured | Sakshi
Sakshi News home page

స్కూలు భవనంపై కూలిన హెలికాప్టర్‌

Oct 4 2016 5:51 PM | Updated on Sep 4 2017 4:09 PM

స్కూలు భవనంపై కూలిన హెలికాప్టర్‌

స్కూలు భవనంపై కూలిన హెలికాప్టర్‌

మలేసియా మిలటరీకి చెందిన హెలికాప్టర్‌ ఓ పాఠశాలపై కూలిపోయింది.

కౌలాలంపూర్‌: మలేసియా మిలటరీకి చెందిన హెలికాప్టర్‌ ఓ పాఠశాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు సహా 22 మంది గాయపడ్డారు. మంగళవారం బోర్నియో ద్వీపంలోని సబా రాష్ట్రం తవాలో ఈ దుర్ఘటన జరిగింది.

సాధారణ మిలటరీ కార్యకలాపాల్లో భాగంగా ఈ హెలికాప్టర్‌ వెళ్లినట్టు మలేసియా ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు చెప్పారు.  పాఠశాల భవనం పైకప్పుపై హెలికాప్టర్‌ అత్యవసరంగా క్రాష్‌ ల్యాండ్‌ అయినట్టు చెప్పారు. ఇందులో ప్రయాణిస్తున్న 14 మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. కాగా పైలట్‌ పరిస్థితి విషమంగా ఉండగా, ఏడుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement