లండన్: ఆంక్షల రాజ్యంలో హక్కుల కోసం ఎలుగెత్తి నినదించడం అంత సులభం కాదు. ఇక చిన్నపిల్లల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కానీ మలాలా అధైర్యపడలేదు. అన్నపానీయాలెంత అవసరమో, జ్ఞానం కూడా అంతే అవసరమనుకుంది ఆ చిన్నారి. తాలిబన్ల రాజ్యంలో బాలికల హక్కుల అణచివేతపై గొంతు విప్పింది. తుపాకులు, బాంబులతో విరుచుకుపడే శత్రువులను కేవలం కలంతో, మాటలతో ప్రాణాలకు తెగించి ప్రతిఘటించింది. మతోన్మాదుల పాలనలో అక్షరాలకు దూరమైన బాలికల వెతలను ఆవేదనతో ఆర్తిగా ప్రపంచం కళ్లకు కట్టింది. ఆ అకుంఠిత పోరాటంలో శత్రువు తూటాల దాడికి గురై మృత్యువుకు చేరువదాకా వెళ్లింది. తర్వాత కూడా ఆమె వీరోచిత పోరాటం ఆగలేదు. తమ దేశంలోనే కాకుండా అణగారిన దేశాలన్నింటిలోని బాలికల హక్కుల రక్షణకు నడుం బిగించింది.
ఈ కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి ఆమె ఒడిలో వచ్చి వాలింది. ప్రపంచంలో అందరికీ తెలిసిన టీనేజర్‌గా గుర్తింపు పొందిన మలాలా యూసఫ్ జాయ్ 1997 జూలై 12నలో పాకిస్థాన్‌లోని ఖైబర్-పక్తూన్‌క్వా రాష్ట్రం స్వాత్‌లోయలోని మింగోరా పట్టణంలో సున్నీ ముస్లింల కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి జియావుద్దీన్ స్కూలు యజమాని. విద్యాహక్కు కార్యకర్త. మలాలా ఆయన స్కూల్లోనే చదువుకుంది. 2007 నుంచి 2012 వరకు స్వాత్ లోయలోని పలు ప్రాంతాల్లో తాలిబన్ల నిరంకుశ పాలన సాగింది. ఉగ్రవాదులు టీవీలు, సినిమాలు, పుస్తకాలపై నిషేధం విధించారు. బాలికలు చదువుకోకూడదంటూ వారి పాఠశాలలను పేల్చేశారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో మలాలా గొంతువిప్పింది. 2008లో పెషావర్ సభలో ‘విద్య నా ప్రాథమిక హక్కు. దాన్ని లాగేసుకోవడానికి తాలిబన్లకు ఎంత ధైర్యం?’ అని మండిపడింది. 2009లో 12 ఏళ్ల వయసులో బీబీసీ బ్లాగులో గుల్ మకాల్ అనే పేరుతో స్వాత్ బాలికల దయనీయ స్థితిని వివరించింది. మీడియాఇంటర్వ్యూల్లో తాలిబన్లపై నిప్పులు చెరిగింది.
తలలోకూ తూటా.. :మలాలా పోరాటాన్ని తాలిబన్లు సహించలేకపోయారు. 2012 అక్టోబర్ 9న స్కూలుకు వెళ్తుండగా ఓ మిలిటెంట్ ఆమెపై మూడు తూటాలు పేల్చాడు. ఒకటి ఆమె తలలోకి దూసుకెళ్లి భుజం దాకా వెళ్లింది. ఆ ప్రాణాంతక గాయానికి మెరుగైన చికిత్స కోసం ఆమెను బ్రిటన్‌కు తరలించారు. చికిత్సతో కోలుకున్న మలాలా ప్రస్తుతం బర్మింగ్‌హామ్ స్కూల్లో చదువుకుంటోంది. పాక్‌కు వస్తే చంపుతామని తాలిబన్లు బెదిరించడంలో మలాలా కుటుంబం బ్రిటన్‌లోనే ఉంటోంది. ఐక్యరాజ్య సమితితో కలిసి విద్యా హక్కుకోసం పోరాడుతోంది. యూరోపియన్ యూనియన్ మానవ హక్కుల అవార్డు, పాకిస్థాన్ యువ శాంతి పురుస్కారం వంటి ఎన్నో అవార్డులు అందుకుంది. ‘ఐయామ్ మలాలా’ పేరుతో గత ఏడాది ఆత్మకథను వెలువరించింది. ‘‘ఉగ్రవాదులు నేను మారతాననుకున్నారు. వారి దాడితో నాలో బలహీనత, భయం పోవడం తప్ప నా జీవితంలో ఎలాంటి మార్పూ రాలేదు. నేను తాలిబ్(తాలిబన్ మిలిటెంట్)ను ద్వేషించడం లేదు. అతడు ఎదురుగా నిలబడితే నా చేతిలో తుపాకీ ఉన్నా కాల్చను’’ అని ఐరాసలో గత ఏడాది ఉద్వేగంగా చెప్పిన మలాలా నిజంగా శాంతదూతే.
అక్షరాల కోసం తుపాకీపై పోరాటం!
Published Sat, Oct 11 2014 12:58 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు
భారత టాప్ రెజ్లర్‌పై సస్పెన్షన్ వేటు
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
మోదీ, రాహుల్ గాంధీలకు ‘బహిరంగ చర్చ’ ఆహ్వానం
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
చంద్రబాబుకి అభివృద్ధి కనిపించడం లేదా?: సజ్జల
తప్పక చదవండి
- కేజ్రీవాల్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్‌కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement