కార్లు, బస్సులకు టోల్గేట్ మినహాయింపు! | Maharashtra gives toll relief to light vehicles, shuts 12 plazas | Sakshi
Sakshi News home page

కార్లు, బస్సులకు టోల్గేట్ మినహాయింపు!

Apr 10 2015 8:19 PM | Updated on Oct 8 2018 6:08 PM

తేలికపాటి మోటారు వాహనాలు (కార్లు), రాష్ట్ర రవాణా బస్సులకు టోల్గేట్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం ప్రకటించారు.

తేలికపాటి మోటారు వాహనాలు (కార్లు), రాష్ట్ర రవాణా బస్సులకు టోల్గేట్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం ప్రకటించారు. ముంబై నగరం, ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వే, కొల్హాపూర్ మినహా రాష్ట్రంలో ఉన్న మిగిలిన 53 టోల్ ప్లాజాలలో ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఇక మహారాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్, ప్రజా పనుల శాఖ నిర్వహించే 12 టోల్ ప్లాజాలను మే 31 అర్ధరాత్రి నుంచి పూర్తిగా మూసేస్తున్నారు.

ముంబై నగరంలోకి వచ్చి, వెళ్లే ఐదు పాయింట్లు, పుణె-ముంబై ఎక్స్ప్రెస్ వే, కొల్హాపూర్ నగరాల నుంచి మాత్రం భారీ స్థాయిలో ఆదాయం వస్తుంది కాబట్టి వాటి వద్ద ఈ మినహాయింపు వర్తించదని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ. 500 కోట్ల భారం పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement