చిత్తూరు జిల్లాలో స్వల్ప భూకంపం | Light earthquake in chitoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో స్వల్ప భూకంపం

Sep 9 2015 11:18 PM | Updated on Jun 4 2019 5:04 PM

చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ రామకష్ణాపురంలో బుధవారం స్వల్పంగా భూమి కంపించింది.

సోమల(చిత్తూరు): చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ రామకష్ణాపురంలో బుధవారం స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఉన్నట్టుండి భీకర శబ్ధం రావడంతో వ్యవసాయ పొలాల వద్ద పనులు చేసుకుంటున్న రైతులు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలో ఉన్న మహిళలు ఏం జరుగుతుందోన్న ఆందోళనతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

50 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో భూకంపం తాకిడికి 20 ఇళ్లలో గోడలు బీటలు వారాయి. భయాందోళనలతో గ్రామస్తులు చాలాసేపు ఇళ్లలోకి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. మారుమూల గ్రామం కావడంతో రాత్రి వరకు ఆ గ్రామానికి అధికారులు ఎవరూ వెళ్లలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement