ఎల్జీ, శాంసంగ్లకు పోటీగా మోటోరోలా ఫోన్ | Lenovo may soon launch new variant of Moto Z smartphone with faster processor | Sakshi
Sakshi News home page

ఎల్జీ, శాంసంగ్లకు పోటీగా మోటోరోలా ఫోన్

Jan 23 2017 2:52 PM | Updated on Sep 5 2017 1:55 AM

ఎల్జీ, శాంసంగ్లకు పోటీగా మోటోరోలా ఫోన్

ఎల్జీ, శాంసంగ్లకు పోటీగా మోటోరోలా ఫోన్

శాంసంగ్, ఎల్జీలకు పోటీగా ఫాస్ట్ ప్రాసెసర్తో మోటో జడ్ స్మార్ట్ఫోన్ కొత్త వెర్షన్ను లాంచ్ చేయాలని లెనోవో ప్లాన్ చేస్తోంది.

న్యూఢిల్లీ : శాంసంగ్, ఎల్జీలకు పోటీగా ఫాస్ట్ ప్రాసెసర్తో మోటో జెడ్ స్మార్ట్ఫోన్ కొత్త వెర్షన్ను లాంచ్ చేయాలని లెనోవో ప్లాన్ చేస్తోంది. పునరుద్ధరించబడిన మోటో జెడ్ స్మార్ట్ఫోన్ను లెనోవో మోటోరోలా త్వరలోనే వినియోగదారులు ముందుకు తీసుకొస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అప్గ్రేడ్ అయిన ప్రాసెసర్, ఆండ్రాయిడ్ వెర్షన్తో  ఈ హ్యాండ్సెంట్ ఇప్పటికే గీక్బెంచ్ బెంచ్మార్కులో లిస్టు అయిందట. ప్రస్తుత మోటో జెడ్ మోడల్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్ను కలిగి ఉంది. తాజా వెర్షన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్తో దీన్ని ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది.
 
గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ నోగట్ ఓఎస్ను ఇది కలిగి ఉండబోతుందట. 4జీబీ ర్యామ్తో ఇది మార్కెట్లోకి వస్తుందని ఈ వెబ్సైట్ పేర్కొంటోంది. ఫ్యూచర్-ప్రూఫ్తో కొత్త ప్రాసెసర్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్, మంచి ర్యామ్ వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా లెనోవో ప్రణాళికలు రచిస్తోంది. అప్గ్రేడెట్ మోటో జెడ్ స్మార్ట్ఫోన్ కచ్చితంగా ప్రస్తుతమున్న ఎల్జీ, శాంసంగ్ ఫ్లాగ్షిప్లకు గట్టిపోటీ ఇస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎస్8 కూడా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్తోనే మార్కెట్లోకి రాబోతుందని టాక్. గత అక్టోబర్లో ప్రవేశపెట్టిన మోటో జడ్ స్మార్ట్ ధర రూ.39,999.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement