కేరళ స్థానిక ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ జయభేరి | LDF JayaBheri local elections in Kerala | Sakshi
Sakshi News home page

కేరళ స్థానిక ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ జయభేరి

Nov 8 2015 1:16 AM | Updated on Mar 29 2019 9:31 PM

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని అధికార యూడీఎఫ్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

♦ చతికిలబడ్డ అధికార యూడీఎఫ్
♦ మెరుగైన పనితీరు కనబరిచిన బీజేపీ
 
 తిరువనంతపురం: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని అధికార యూడీఎఫ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా పరిగణించిన ఈ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని విపక్ష ఎల్‌డీఎఫ్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ తాజాగా ఒక మున్సిపాలిటీలో గెలవడంతోపాటు 14 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించింది. ముఖ్యంగా 100 వార్డులుగల తిరువనంతపురం కార్పొరేషన్‌లో  34 వార్డుల్లో గెలుపొందింది.

మొత్తం ఆరు కార్పొరేషన్లకుగాను నాలుగు కార్పొరేషన్లు, 86 మున్సిపాలిటీలకుగాను 45 మున్సిపాలిటీలు, 941 గ్రామ పంచాయతీలకుగాను 545 పంచాయతీల్లో ఎల్‌డీఎఫ్ విజయదుంధుభి మోగించింది. యూడీఎఫ్ రెండు కార్పొరేషన్లు, 40 మున్సిపాలిటీలు, 366 గ్రామ పంచాయతీల్లోనే గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement