ఎంపీ పాస్తో ఏఐసీసీ భేటీకి వచ్చా: లగడపాటి | Lagadapati rajagopal attendants AICC meeting in new delhi | Sakshi
Sakshi News home page

ఎంపీ పాస్తో ఏఐసీసీ భేటీకి వచ్చా: లగడపాటి

Jan 17 2014 2:30 PM | Updated on Aug 17 2018 6:00 PM

ఎంపీ పాస్తో ఏఐసీసీ భేటీకి వచ్చా: లగడపాటి - Sakshi

ఎంపీ పాస్తో ఏఐసీసీ భేటీకి వచ్చా: లగడపాటి

కాంగ్రెస్ పార్టీ తనకు పాస్ మంజూరు చేయకపోయిన తన ఎంపీ పాస్పై ఏఐసీసీ సమావేశాలకు వచ్చానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ తనకు పాస్ మంజూరు చేయకపోయినా  తాను  ఎంపీ పాస్పై ఏఐసీసీ సమావేశాలకు వచ్చానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అందులో భాగంగా లగడపాటి సమైక్యాంధ్ర ప్లకార్డులను ప్రదర్శించి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. దాంతో  లగడపాటికి పోటీగా తెలంగాణ ప్రాంతా నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు తెలంగాణ ప్లకార్డులను ప్రదర్శించారు.

 

ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, సబ్బం హరి, హర్షకుమార్లకు పాసులు నిరాకరించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఈ  సమావేశాల్లో సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించవచ్చనే అనుమానంతో వారికి అనుమతి నిరాకరించారు. అదికాక ఏఐసీసీ సమావేశాలకు హాజరుకావద్దని సోనియా రాజకీయ వ్యవహరాల కార్యదర్శి అహ్మద్ పటేల్ స్వయంగా ఫోన్ చేసి లగడపాటికి వెల్లడించారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement