అదరగొట్టిన కోటక్‌ మహీంద్ర | Kotak Mahindra Bank Profit & NII Beat CNBC-TV18 Poll Estimates In Q4 | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన కోటక్‌ మహీంద్ర

Published Thu, Apr 27 2017 1:51 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

అదరగొట్టిన కోటక్‌ మహీంద్ర


ముంబై:  ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌  కోటక్‌ మహీంద్రా  క్యూ4  ఫలితాల్లో మార్కెట్‌ అంచనాలను బీట్‌ చేసింది. స్లాండ్‌ ఎలోన్‌ ప్రాతిపదికన  నికర లాభాలు 40శాతం ఎగిసి రూ. 977 కోట‍్లను సాధించింది. మొత్తం ఆదాయం రూ. 2,161కోట్లను సాధించినట్టు నివేదించింది. ప్రొవిజన్స్‌ 172 కోట్ల పోలిస్తే ఈ క్వార్టర్‌ లో రూ.262కోట్లుగా నిలిచింది. ఇతర ఆదాయం రూ. 1002 కోట్లుగా నిలిచింది.

స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.42 శాతం నుంచి 2.59 శాతానికి ఎగశాయి. నికర ఎన్‌పీఏలు కూడా 1.07 శాతం నుంచి 1.26 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 4.49 శాతం నుంచి 4.6 శాతానికి బలపడ్డాయి.   ఈ ఫలితాల నేపథ్యంలోకోటక్‌ షేర్‌ లాభాల్లో కొనసాగుతోంది.

Advertisement
Advertisement
Advertisement