breaking news
Beat Estimates
-
హీరో మోటో లాభాలు భేష్
సాక్షి, ముంబై: అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరోమోటో కార్ప్ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్ త్రైమాసికంలో బలమైన ఫలితాలను ప్రకటించింది. దీంతో శుక్రవారం నాటి ట్రేడింగ్ హీరో మోటో షేరు 3 శాతానికిపైగా లాభాలతో హీరోగా నిలిచింది. అంచనాలకు మించి 2020 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 14.5 శాతం నికర లాభం పెరిగి 880 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 769 కోట్ల రూపాయలు. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో 17శాతం పుంజుకుని రూ.773 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.905 కోట్లకు పెరిగిందని ఫలితాల సందర్భంగా కంపెనీ వెల్లడించింది. అయితే మొత్తం అమ్మకాలు 17,98,905 యూనిట్ల నుంచి 14.34 శాతం తగ్గి 15,40,876 యూనిట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం 11 శాతం తగ్గి రూ .6,997 కోట్లకు చేరిందని హీరో మోటొకార్ప్ సీఎఫ్ఓ నిరంజన్ గుప్తా వెల్లడించారు. ఈ త్రైమాసికంలో ఇబిట్టా 6 శాతం తగ్గి రూ.1,105 కోట్ల నుంచి రూ.1,039 కోట్లకు చేరింది, ఇబిట్టా మార్జిన్లు 80 బీపీఎస్ పాయింట్లు పెరిగి 14.8 శాతానికి పెరిగింది. అలాగే రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.65 డివిడెండ్(3,250 శాతం) ఇవ్వనున్నామని తెలిపారు. -
అదరగొట్టిన కోటక్ మహీంద్ర
ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా క్యూ4 ఫలితాల్లో మార్కెట్ అంచనాలను బీట్ చేసింది. స్లాండ్ ఎలోన్ ప్రాతిపదికన నికర లాభాలు 40శాతం ఎగిసి రూ. 977 కోట్లను సాధించింది. మొత్తం ఆదాయం రూ. 2,161కోట్లను సాధించినట్టు నివేదించింది. ప్రొవిజన్స్ 172 కోట్ల పోలిస్తే ఈ క్వార్టర్ లో రూ.262కోట్లుగా నిలిచింది. ఇతర ఆదాయం రూ. 1002 కోట్లుగా నిలిచింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.42 శాతం నుంచి 2.59 శాతానికి ఎగశాయి. నికర ఎన్పీఏలు కూడా 1.07 శాతం నుంచి 1.26 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.49 శాతం నుంచి 4.6 శాతానికి బలపడ్డాయి. ఈ ఫలితాల నేపథ్యంలోకోటక్ షేర్ లాభాల్లో కొనసాగుతోంది.