కేజ్రీవాల్పై రాళ్ల దాడి | Kejriwal target of stones in Varanasi | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్పై రాళ్ల దాడి

Apr 18 2014 9:01 AM | Updated on Apr 4 2018 7:42 PM

కేజ్రీవాల్పై రాళ్ల దాడి - Sakshi

కేజ్రీవాల్పై రాళ్ల దాడి

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై మరో సారి దాడి జరిగింది.

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా మరో సారి దాడి జరిగింది. వారణాసి నగరం బెనారస్ హిందూ యూనివర్శిటీ సమీపంలో గురువారం రాత్రి ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీవాల్పై ఆగంతకులు రాళ్ల వర్షం కురిపించారు. అనంతరం ఆగంతకులు హర్ హర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

 

ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటన అక్కడికి చేరుకుని  రాళ్ల దాడి చేసిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. అయితే గత నెల 25న వారణాసిలో కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. అనంతరం ఈ నెల 4న కేజ్రీవాల్పై దక్షిణ ఢిల్లీలో ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement