కేజ్రీవాల్ మరో ఘనత | Kejriwal second-most followed Indian politician on Twitter | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ మరో ఘనత

Nov 19 2015 12:12 PM | Updated on Aug 20 2018 5:33 PM

కేజ్రీవాల్ మరో ఘనత - Sakshi

కేజ్రీవాల్ మరో ఘనత

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో ఘనత సాధించారు.

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్) అగ్రనేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో ఘనత సాధించారు. మనదేశంలో ట్విటర్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన రెండో రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. బుధవారం రాత్రికి ట్విటర్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 60 లక్షలకు చేరింది. ట్విటర్ లో 60 లక్షల మార్క్ ను కేజ్రీవాల్ దాటారని 'ఆప్' సోషల్ మీడియా చీఫ్ అంకిత్ లాల్ తెలిపారు.

ట్విటర్ లో కేజ్రీవాల్ కంటే ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారు. 1.6 కోట్ల మంది ఆయనను అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాను విరివిరివిగా వాడే రాజకీయ నాయకుల్లో వీరిద్దరూ అగ్రస్థానంలో ఉన్నారు. ట్విటర్ లో ఎక్కువ మంది పాలోవర్లు కలిగిన రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్ నేత శశి థరూర్ ఒకరు. ఆయనకు 35 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సెలబ్రిటీల ట్విటర్ జాబితాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ 1.7కోట్ల ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement